SEARCH

THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS

Tuesday, June 13, 2017

Saturday, June 10, 2017

ప్రకృతిలో దైవ స్వరూపాలు

ప్రకృతిలో దైవ స్వరూపాలు



కథలు - కాశీ విశ్వనాథుని ఆలయం

కథలు -  కాశీ విశ్వనాథుని ఆలయం

కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా.. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా.. దానిపై ‘నా భక్తుని కొరకు’ అని రాసి ఉంది. ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే.. అది మట్టిపాత్రగా మారిపోయింది. విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం.. పళ్లాన్ని ముట్టుకోవడం.. అది మట్టిపాత్రలా మారిపోవడం.. ఇదే తంతు! విషయం కాశీ రాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు. జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు. అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు.. నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముడనో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు. కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. ‘విశ్వనాథా! ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’ అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు. తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి.. ‘ఓ పెద్దాయన.. నువ్వూ వచ్చి ముట్టుకో.. రోజూ గుడికొస్తావ్‌గా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది’ అని హేళనగా అన్నాడు. పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు. ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.
నా జీవితం లోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!
నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.
నేను ఆయన ప్రేమను అడిగాను- భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.
నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.
నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.
నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.
నేను ఆయన్ను మరువకూడదు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.
నేను పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.
అలా జీవితం లో నేను కోరుకున్నదేదీ పొందలేదు - నాకు కావలసిందే నేను పొందాను.
ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.
చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను. మీరు కూడాఅర్ధం చేసుకోండి. జరిగేది అంతా మన మంచికే...లోకా సమస్తా స్సుఖినోభవ౦తు

MARIKAMBA TEMPLE

Marikamba Temple



Sri Marikamba Temple of Sirsi is a famous Devi shrine situated in northern part of the state of Karnataka. The temple is highly regarded by the devotees spread not just all over Karnataka but also in the neighboring states of Tamil Nadu and Andhra Pradesh. Every alternate year millions of devotees from remote parts of the country gather at Sirsi to participate in the famous Shri Marikamba Fair. Darshana of Devi is considered to be extremely auspicious during the time of the fair.

Sri Marikamba Temple houses a huge idol of Devi - about seven feet tall. The temple is said to have been built in the year 1689. It is in fact considered to be the biggest idol and temple dedicated to Marikamba in the state of Karnataka. People of Uttara (northern) Kannada and Dakshina (southern) Kannada districts regard Goddess Marikamba as their chief goddess of worship and a family deity. They believe that Devi dispels evil forces and protect them from natural calamities.

Location of Sri Marikamba Temple at Sirsi too attracts number of devotees. Sirsi is surrounded by hills, picturesque thick deciduous forest and several waterfalls. An altitude of 2500 feet above the sea level, ensures that Sirsi enjoys a wonderful climate at all times. Plethora of other places of tourist attraction is complimented by the good nature people of this town.

కాణిపాక వరసిద్ది వినాయక స్వామి చరిత్ర

కాణిపాక వరసిద్ది వినాయక స్వామి చరిత్ర

Image result for kanipakam vinayaka images


చిత్తూరు జిల్లాలో ఎందరో దేవుళ్ళు, దేవతలు వెలసియున్నారు.

ప్రస్తుతము `కాణిపాకంగా  పిలువబడుతున్న గ్రామము పూర్వము విహారపురి అని పిలువబడేది. ఈ గ్రామము,పరిసర ప్రదేశములు, దివ్యభవములతోను,ప్రకృతి రమణీయకతతోను వింత వింత అందాలతో కళ కళ లాడుతూ దేవతలను సైతం తన్మయులై చేసేవి. అందుకే దేవతల పురి(గ్రామములో) లో విహరిస్తూ వుండేవారు.కాబట్టి దానికి విహరపురి
అని పేరు వచ్చింది. ఇప్పటికి ఈ ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ విహార పురికి ప్రక్కగా ఒక నది ప్రవహిస్తుంది.

పూర్వం ఒకప్పుడు శంఖుడు,లిఖితుడు అను అన్నదమ్ములు ఇక్కడ స్వయంభువుగా వెలసియున్న శ్రీ వరసిద్ది వినాయకుడుని మహిమలను విని ,ఆ స్వామిని చూచుటకు ఎంతో దూరం నుండి కాలి నడకన బయలుదేరారు.చాలా దూరం నుండి వస్తూండడంచేత తాము తెచ్చుకొన్న ఆహారం అయిపోయింది.అన్నదమ్ములు ఇద్దరుఅలసిపోయారు. వారికీ ఆకలి బాగా ఎక్కువ బాధిస్తుంది.అయిన వారు పట్టుదలగా నడుస్తూనే వున్నారు. వీరు నడచి వచ్చు దారిలో వారికీ ఒక మామిడి పండ్ల తోట కనిపించింది..చెట్ల నిండా కాయలు ఆరముగ్గి వేలాడుతున్నాయి.

తమ్ముడైన లిఖితుడు చిన్న వయస్సుకావడం చేత ఆకలికి తట్టు కోలేకపోతున్నాడు.చెట్టు నుండి ఒక పండును కోసుకొని తింటానని అన్నయైన శంఖుని అడిగాడు.అ తోటకు సంబందించిన వ్యక్తులు ఎవ్వరు ఆ ప్రాంతంలో వారికీ కనిపించలేదు. యజమానిని అడగకుండా ఏ వస్తువును తీసుకొన్న అది దొంగతనము అవుతుందని, కావున మామిడి పండును కోయరాదని ఇక చేరవలసిన కాణిపాక ప్రదేశము(విహార పురి) దగ్గరలోనే వుందని తమ్మునికి నచ్చ చెప్పాడు.తమ్ముడైన లికితుడు ఆకలికి తట్టుకోలేక పోతున్నాడు.అన్న మాటలను పెడ చెవిన పెట్టి తమ్ముడు మామిడి చెట్టు నుండి ఒక పండును కోసుకొని తిన్నాడు

తను చెప్పుతున్న వినిపించుకోక ధర్మ విరుద్దంగా ప్రవర్తించిన తమ్ముడిని శంఖుడు తిన్నగా అ ఊరి రాజు వద్దకు తీసుకువెళ్లి తన తమ్ముడు ఎవరిదో అయిన తోటలోని మామిడి చెట్టు నుండి వారి అనుమతి లేకుండా ఒక పండును కోసుకొని తిన్నాడని, అది దొంగతనము అనిపించుకొంటుందని, కావున తన తమ్ముడిని శిక్షించే రాజుతో ఫిర్యాదు చేస్తాడు. రాజు లిఖితుని రెండుచేతులను నరికి వేయమని భటులను ఆజ్ఞ పిస్తాడు. రాజ భటులు లిఖితుని రెండు చేతులను నరికి వేస్తారు. చిన్న తప్పు చేసిన తన తమ్ముడికి రాజు ఇంత ఘోరమైన శిక్షా వేస్తాడని శంఖుడు అనుకోలేదు. ఎంతో బాధ పడ్డాడు. అయినా ఇక చేయగలిగేది ఏమిలేదు అని అక్కడ నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు శ్రీ వర సిద్ది వినాయకుని తలుచుకొంటూ ఆ స్వామిని దర్శించడానికి బయలు దేరారు. వెళ్ళునది దైవ దర్శనముకు. అందుచే శంఖు, లిఖితులు స్వామివారికి ప్రక్కన ప్రవహించు నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని అ నదిలోకి అన్నదమ్ములు ఇద్దరు దిగారు. నదిలో వారు స్నానముకు మునిగినంతనే లిఖితునకు నరుక బడిన చేతులు పూర్వంలాగే వచ్చేశాయి. వారి ఆనందానికి అవధులు లేవు. నదిలో మునిగినంతనే పోయిన రెండు చేతులు తిరిగి వచ్చినవి కనుక ఆనాటి నుండి ఆ నదికి `బాహుదా` అనే పేరు స్తిరపడిపోయింది. నాటి నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు వినాయక స్వామి వారి మహత్యంను కీర్తిస్తూ  ప్రచారం చేస్తూ జీవించారు.

అట్లు కొంతకాలం జరిగాక బహుదా నది వరదలు మొదలగు ప్రకృతి విలయ తాండవం వల్ల స్వామి వారి విగ్రహం భూమిలో నిక్షిప్తం అయింది. ఆనాడు దానిని ఉద్దరించే వారు లేకపోవడం చేత వినాయక స్వామి చాలా కాలం భూమిలో మరుగున పడి పోయాడు. కాలక్రమంలో అ ప్రాంతం తిరిగి సస్యశామలం అయి పండ్ల తోటలతోను, పచ్చని ఫైరు పంటలతోను శోభాయమానంగా తయారు అయిoది.

పుట్టుకతోనే ఒకరు గ్రుడ్డి, ఒకరు చెవిటి, ఒకరు మూగ అయిన ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామమునకు ఎక్కడినుండో వచ్చి స్తిరపడ్డారు. వారు ముగ్గురు ఒకరికొకరు సాయం చేసుకొంటూ కలిసి జీవించేవారు.వారు ఆ గ్రామంలో కొంత భూమిని సేకరించికొని అందులో ఒక నుయ్యిని త్రవ్వుకొని ఆ నీటితో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకొంటూ వుండేవారు. అలా కొంతకాలం జరిగాక విహార పురిలో కరువు ఏర్పడింది. వానలు లేక నేల బీటలు వారింది. రైతులు,ప్రజలు పంటలకే కాదు. త్రాగు నీటికి కూడా చాలా బాధ పడవలసి వచ్చింది.బహుదా నది ఎండి పోయిoది.అంటూ రోగాలు ప్రబలాయి. ప్రజలు ఆకులూ, అలములు తిని బ్రతకవలసిన పరిస్టితి ఏర్పడింది. ఇక అ వికలాంగుల పరిస్టితి మరి దయనీయంగా మారింది

ఒకనాడు అ ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని నూతిని మరికొంచెము లోతు చేయడం మంచిదని తలచి అందుకు నడుం కట్టారు. వారు ముగ్గురు బావిని త్రవ్వగా త్రవ్వగా కొంత తడి తగిలింది.నీరు కొద్ది కొద్దిగా ఉరుతోంది. బావిలో నుండి నీటిని ఫైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి  కుండను వదిలారు.అది పగిలి పోయిoది.మళ్ళి మరొక కుండను వదిలారు. అది కూడా పగిలిపొయింది.అలా చాలా కుండలు పగిలిపోవడంతో బావిలోపల ఏదో ఒక రాయి ఉన్నట్లు ఉంది. దానిని తొలగిస్తే ఇట్ల కుండలు పగిలి పోకుండా వుండటమే కాక మరికొంత నీరు ఉరుతోందని భావించి రాతిని పెకలించేందుకు చెవిటి,మూగ వారిద్దరూ బావిలోకి దిగారు. అట్లు
అడ్డు పడిన రాతిని పగులకొట్టి పూర్తిగా పెల్లగించాలనికుని వారు గునపంతో పదే పదే పోడవ సాగారు. త్రవ్వుతున్న ఆ ప్రదేశంలో గునపం పడిన చోటు నుండి ఖంగు మనే శబ్దం వచ్చింది.

అట్లు వారు మూడు సార్లు ప్రయత్న్నం చేయగా మూడు సార్లు ఈ విధంగా శబ్దం వచ్చి చివరి దెబ్బతో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే అ ముక్క పగిలిన చోటు నుండి రక్తం చిమ్మింది. రక్తం చిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభు వినాయకుని తల వెనుక భాగం చిట్లి ముక్క ఎగిరి పడడమే,ఆ రక్తం ఏక ధారగా కారుతూనే వుంది.ఎంతకు ఆగటం లేదు.

ఆ రక్తం అలా ఎగజిమ్మడంతో ఒడ్డున వున్న గ్రుడ్డివాడు, బావిలోపల ఉన్న మూగవాడు, చెవిటివాడు కూడా ఆ రక్తంతో తడిసారు. అట్లు వారు రక్తంతో తడియగానే మూగ వాడికి మాటలు, గ్రుడ్డివాడికి దృష్టి,చెవిటి వానికి శ్రావణ శక్తి లభించాయి. ఆ ప్రభావంతో ముగ్గురి అంగవైకల్య్యం తొలగిపోవడంతో అది దైవకృపయే అని ఆనందంతో భక్తిపరవశులైవారు.ఆ దైవమూర్తి నుండి వెలువడే రక్త ప్రవాహంఆగకపోవడంతో దానిని వారించడానికి వారు చేయు ప్రయత్నములు ఫలించక పోవడంతో చూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగిది అంత పూస గ్రుచ్చి నట్లు రాజుకు వివరించాడు. ఈ విషయంను విన్న రాజులో ఆనందం,భయాందోళనలు కలిగి మనసు వికలం అయిoది.

ఆ సంఘటన జరిగిన ముందు రాత్రి రాజుకు వినాయక స్వామి విగ్రహం కలలో కన్పించడం, ఇపుడు నిజంగా ఇలా దర్శనం ఇవ్వడం రాజుకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది. స్వామి తల నుండి వచ్చుచున్న రక్త ప్రవాహం ఆగటం లేదని తెలిసి కొనిన విహారపురి రాజు తన
అంతఃపుర కాంతలతోను, సమస్త దండనాయకులతో, దాసదాసి పరివారముతో బయలుదేరి వర సిద్ది వినాయకుడు ఆవిర్భవించిన స్టలానికి చేరుకొన్నారు. విషయం తెలిసిన ప్రజలు గుంపులు గుంపులుగా రాజు వెంట అక్కడకు చేరుకొన్నారు. బావి దగ్గరకు చేరిన ఆ ప్రజా సముహంలోని భక్తి భావానికి అవధులు లేవు. కొబ్బరికాయలు, పత్ర పుష్పములు, కర్పూరాది పూజ ద్రవ్యములతో అపరమిత భక్తితో ఆ వినాయకస్వామిని పూజిస్తూ పలు విధాలుగా కీర్తించారు. శ్రోత్రనామాలు గానం చేసారు. భజనలు, అర్చనలు,నైవేద్యములు,సాష్టాంగ దండ ప్రణామాలతో తమ తప్పు మన్నించి స్వస్థరూపమున పొందుమని ప్రార్ధించారు. అయినా రక్తధార ఆగటం లేదు.స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బరి కాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. ఆ భక్తులు సమర్పించిన స్వచ్చమైన కొబ్బరినీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది. అంతకుముందు అంగ వికలురుగా నున్న ఆ ముగ్గురుకు చెందిన భూమి (కాణి మాగాణి =1.3 ఎకరాలు) అంతట కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది.అదే మాట కాలక్రమంలో `కాణిపాకం` గా మారి స్టిరపడింది.(తమిళ సంప్రదాయంలో గ్రామాల పేర్ర్లు చివర పాకం,బాకం వంటి పదాలు ఉండడం తెలిసిందే కదా)

ఈ విధంగా చిత్తూర్ జిల్లాలోని విహారపురి (ప్రస్తుత కాణిపాకం)లో శ్రీ వర సిద్ది వినాయకుడు స్వయంభువుగా తిరిగి ప్రకటింపబడ్డాడు.ఆనాటి నుండి వివిధ రాజుల ప్రజల సేవలతో ఆ క్షేత్రం అభివృద్ధి చెందింది.

PICTURES OF KANCHI VARADHARAJASWAMI AND THAAYAAR AMMAVARU

PICTURES OF KANCHI VARADHARAJA SWAMI ANDTHAAYAAR AMMAVARU










PIC CREDITS: VATSALA


Mahaperiava

This  rare photo which is now widely posted and displayed is unique. Understand that this photo was taken by a foreign devotee. It is unique as Mahaperiava is facing the camera direct. Wherever you view , whichever angle you see this photo, His eyes will be looking at you benignly.

ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు

ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు


దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.





LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...