SEARCH

THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS

Monday, August 31, 2015

శ్రావణ శుక్రవారపు పాట

శ్రావణ శుక్రవారపు పాట

కైలాసగిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమధాదిగణములు కొలువగాను
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగెను పార్వతపుడు
(జయ మంగళం నిత్య శుభమంగళం)
ఏ వ్రతము సంపదలు నెలమి తోడుత నిచ్చు యే వ్రతము
పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచును పార్వతి పరమేశు నడిగెను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
కుండిన అనియెడి పట్నంబులో చారుమతి అని ఒక  పడతి గలదు
అత్తమామల సేవ అతి భక్తితో చేసి పతిభక్తి గలిగుండు భాగ్యశాలి
(జయ మంగళం నిత్య శుభమంగళం)
వనిత స్వప్నమందు వరలక్ష్మిచేబోయి చారుమతి లేలెమ్మని చేత చరచెను
చరచినప్పుడు లేచి మీరెవ్వరని నమస్కరించి పల్కెనలినాక్షితో
(జయ మంగళం నిత్య శుభమంగళం)
వరలక్ష్మి నేను వరములు ఇచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను
కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములానిచ్చేటి వరలక్ష్మి
(జయ మంగళం నిత్య శుభమంగళం)
ఏ విభుని పూజచేయవలెననుచూ చారుమతి యడిగేను శ్రావణముగనూ
యే మాసంబున యే పక్షంబు యే వారమునాడు యే ప్రొద్దున
(జయ మంగళం నిత్య శుభమంగళం)
శ్రావణమాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలుదెచ్చి బాగుగాను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
చారుమతి లేచి యా శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగానూ
స్వప్నమున శ్రీ మహాలక్ష్మి చకచకవచ్చి కొల్వమని బల్కెను కాంతలారా
ఏ విధమున పూజ సేయవలెనని భందువులడిగిరి ప్రేమతోను
యే యే మాసంబున యే వారమునాడు యే ప్రొద్దునాడు
శ్రావణ మాసాన శుక్ల పక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు దెచ్చి బాగుగా తను నిల్పి భక్తితో పూజింపుమని జెప్పెను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
అపుడు శ్రావణమాసము ముందుగా వచ్చెనని భక్తితో పటమునలంకరించె
వన్నెతోరణాలు సన్నజాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి
వరలక్ష్మి నోమనుచు వనితలు అందరూ పసుపుతోడి పట్టుపుటములు గట్టి
పూర్ణంబు కుడుములూ పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యము పెట్టుదురు
కండిమండిగలు గడగ నెంచియెండిన కుడుములు ఘన వడలునూ
దండిగా పళ్ళెల ఖర్జూరఫలములూ విధిగ నైవేద్యములు పెడుదురు
నిండు బిందెలలోను నిర్మల వుదకమూ పుండరీకాక్షునకు వారు పోసి
తొమ్మిది పోగుల తోరమొప్పగ పోసి తల్లికి కడు సంభ్రమునను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
వేదవిదుడైనట్టి  విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి తొమ్మిది పిండి
వంటలతోను రయమొప్పగ బ్రాహ్మణునకు పాయసం బెట్టుదురు
(జయ మంగళం నిత్య శుభమంగళం)

No comments:

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...