SEARCH

THIS WEEK'S BHAKTILAHARI POPULAR POSTS

Monday, September 28, 2015

నిద్ర లేవగానే చూడదగిన వస్తువులు

నిద్ర లేవగానే చూడదగిన వస్తువులు 

తామరపువ్వు, బంగారం, దీపము, అద్దము, సముద్రము, పొలము, ఆవు, దూడ , భార్య ముఖము , కుడిచేయి హస్తము, చూచుట ఉత్తమము 

Tuesday, September 22, 2015

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా ,
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

జగముల చిరు నగముల పరిపాలించే జననీ ,
అనయము మము కనికరమున కాపాడే జననీ , (2)
మనసే నీ వసమై , స్మరణే జీవనమై (2)
మాయని వరమీయవే మంగళదాయకి ఈశ్వరి .............1

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా ,
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

అందరికన్నా చక్కని తల్లికి ...సూర్యహారతీ 
అందాలేలే చల్లని తల్లికి ...చంద్ర హారతీ  (2)
రవ్వల తళుకుల కలలా జ్యోతుల ....కర్పూర హారతీ (2)
సకల నిగమ వినుత చరణ ...శశ్వత మంగళ హారతి .............. 2

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా ,
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,


Saturday, September 19, 2015

గృహమన్దు శయన దిశలు

గృహమన్దు శయన దిశలు 

  1. తూర్పు ముఖముగా శిరస్సు ఉంచి నిద్రించిన ఐశ్వర్యము లభించును 
  2. దక్షిణముగా శిరస్సు ఉంచి సాయనిన్చ్సిన ధనవృద్ది 
  3. పడమర దిశగా శిరస్సు ఉంచి శయనించిన ప్రబల వృద్ది 
  4. ఉత్తర దిశగా శిరస్సు ఉంచి శయనించిన వ్యాధి, మృత్యుభావము. 


Thursday, September 17, 2015

నమ్మకాలు - MYTHS AND BELIEFS

నమ్మకాలు

(MYTHS AND BELIEFS)


  1. ఇంటి ఇల్లాలు తెచ్చే కాఫీ లేదా టీ  జారి కింద పడితే ఆ ఇంటికి బంధువులు వస్తారు లేదా కొన్ని రోజుల్లో శుభవార్త వినవచ్చు. 
  2. పెళ్ళికాని యువతులు కాటుక కళ్ళకు పెట్టుకున్నచో  చాలా మంచిది ఎటువంటి చెడు దృష్టి పడదు. 
  3. పగిలిన అద్దములో ముఖము చూసుకున్నా, నేల పాలైన నూనెను నెత్తికి రాసుకున్నా ఎల్నాటి శనిలో కష్టాలు పడతారు 
  4. అనుకోకుండా గడప పైన తుమ్మినప్పుడు ఆయుక్షినము అనుకోకుండా చిటికెడు నీళ్ళు నెత్తిమీద చల్లుకొని బయటకు వెళ్ళవచ్చును . ఆపదలు తీరుతాయి. 
  5. ఇంటిని శుబ్రపరచే చీపురు, చేట , చెప్పులు, సింహ ద్వారము ముందు ఉంచరాదు. ఇంటికి దరిద్రము 
  6. మీ ఇష్ట దైవ  పూజా సమయంలో అయ్యవారికి పూజించే పుష్పాలు పటము లేదా విగ్రహము పైనుండి కుడి ప్రక్క నుండి కిందికి పడితే త్వరలోనే శుభకార్యము చేయుట, తీర్థయాత్రలు చేయుట జరుగును. ఎడమ వైపు నుండి పడితే లక్ష్మి ప్రాప్తి లేదా వివాహము కాని వారికి వివాహ ప్రాప్తి కలుగును. 
  7. మీ ఇష్ట దైవ పూజా సమయంలో అమ్మవారికి  పూజించే పుష్పాలు పటము లేదా విగ్రహము పైనుండి కుడి ప్రక్క నుండి కిందికి పడితే భాగ్యవృద్ది , అన్నింటా విజయము.  ఎడమ వైపు నుండి పడితే దారిద్ర బాధలు తొలగును . కష్టాలు దూరమగుటకు సూచనగా గుర్తించాలి . 
  8. ప్రయాణాలలో, తీర్థయాత్రలలో, దైవ దర్శన సమయాలలో చెప్పులు  పోతే పోగొట్టుకున్న వారికి శనిగ్రహ బాధలు తొలగినట్లు, దొంగలించిన వారికి శని గ్రహ బాధలు ప్రారంభమైనట్లు గమనించాలి . శనివారము పోతే మరీ మంచిది . 
  9. అకస్మాత్తుగా మీ ఇంట్లో చీమలు  దారగా ప్రయాణము చేస్తుంటే ఇదివరనుండి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. త్వరలోనే మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. 
  10. దేవాలయము నందు గాని, పేద బ్రాహ్మణుల ఇంటి యందు కాని, జన సంచారము అధికముగా ఉండే నాలుగు దారుల కలయిక యందు కాని, విద్యాలయమునండు కానీ, హాస్పిటల్ నందు కానీ, దీపమును దానము చేయుట వలన సంతానమునకు బుద్ది, జ్ఞానము, పెరుగును. 
  11. చీపురు, చేట ఒకే దగ్గర ఉంచకూడదు ఐశ్వర్యము హరించుకు పోతుంది 
  12. అరిగిన చీపుర్లు, మసిగుడ్డ, కాళ్ళతో తన్నవద్దు. భాగ్య నష్టము 
  13. అరిగిన చీపుర్లు, మసిగుడ్డ శుక్ర, మంగళ వారములలోపడవేయవద్దు  భాగ్య నష్టము 
  14. తరచు రెండు చేతులను నడినెత్తిన పెట్టుకునే వానికి దారిద్యము దాపురిస్తుంది 
  15. ప్రయాణము చేసిన నాటినుండి 9 వ నక్షత్రమున గాని, 9 వ రోజున కాని, 9 వ తిథి యందు గాని తిరుగు ప్రయాణం చేయరాదు. 
  16. శరీరం పైన గాని,వస్త్రం పైన గాని సాలెపురుగు పడి  ప్రాకుతుంటే త్వరలో శుభం జరుగుతుంది . నూతన వస్తు ప్రాప్తి . 
  17. ఎవరి ఇంట ఎలుకలు బాగా తిరుగుచుండునో భోజనం చేసేవారి సంఖ్యా పెరుగునని ఈజిప్టుల నమ్మకం 
  18. ఎవరి ఇంట బొద్దింకలు ఎక్కువ కనిపిస్తుంటే వ్యాపారం అధికంగా పెరుగుతుందని  ఈజిప్టుల నమ్మకం 
  19. రెండు చేతులతో తల గొకుకునరాదు సమస్యలు పెరుగుతాయి 
  20. అన్నం తినేటప్పుడు తుమ్మినట్లయితే వెంటనే లేచి చేతులు కడుక్కోవాలి లేనిచో ఋణ రోగ బాధలు ఎక్కువ అవుతాయి 
  21. అనుకోకుండా ఇంట్లోకి కప్ప వస్తే త్వరలో మీ ఇంటికి సంపదలు వస్తున్నాయని గ్రహించండి 
  22. నేల పాలైన కుంకుమ నుదుట బొట్టు పెట్టుకోనరాదు 
  23. ఎవరికన్నా డబ్బు ఇవ్వవలసి వస్తే ఎడమ చేతితో ఇస్తే తిరిగిరాదు. ఎడమ చేతితో తీసుకున్నా ఇవ్వలేరు 
  24. గృహములలొ చిరిగినా వస్త్రాలు, అరిగిన చీపురు, అరిగిన చెప్పులు ఉంచరాదు. 
  25. గృహములలొ విరిగిన తలుపులు , పగిలిన లేదా పుచ్చిన గడపలు ఉండరాదు 
  26. సింహ ద్వారం పై కిరణాల ఆకృతి కలిగిన సూర్యుని బొమ్మ తగిలించుకుంటే కష్టాలు కడతేరుతాయి సమస్యలు మీ దగ్గరకు రావు, మీ ముఖంలో కళా కాంతులు మీ ఇంటికి జీవ శక్తి కలిగి సర్వత్రా జయం, మానసిక ఉల్లాసము, బంధువుల్లో గౌరవము పెరుగుతుంది 
  27. పాత ఇంటి కలపను కొత్తగా కట్టుచున్న ఇండ్లకు వాడరాదు 
  28. మంచి కల వచ్చినప్పుడు మీ రెండు అరచేతులు చూసుకొని ఇష్ట దైవాన్ని స్మరించుకొని నిద్ర పొతే మంచిది 
  29. చెడు కలలు వచ్చినప్పుడు లేచి ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని మీ ఇష్ట దైవాన్ని, స్మరించుకొని నిద్రపోవాలి. 

Tuesday, September 8, 2015

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు (2)
అయిదు ప్రాణములు అయిదవతనమే (2)
పసుపు కుంకుమ పడతికే సిరులే (మంగళ)
సిగలో పూవులు నగ అంటి కమల కాటుకే కళలంట (2)
చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట
పతినెడబాయని సతులుంటే
పచ్చని తల్లులు పార్వతులే (2)
పతి సన్నిధిలో కన్నుమూసిన ఆరని కుంకుమ హారతులే
ఆరని కుంకుమ హారతులే (మంగళ)
ఇల్ల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి
మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి (మంగళ) 


Tuesday, September 1, 2015

జయ జయ మంగళగౌరీ

జయ జయ మంగళగౌరీ

జయ జయ శంకరీ కౌమారీ (జయ)
నీవే జగతికి కారణమమ్మా
పరదేవతవు నేవేనమ్మా
నీవే మా ఇలవేలుపువమ్మా
దయగొనవమ్మా అమ్మా అమ్మా (జయ)
చల్లని నీ కనుసన్నలలోనా
కొనసాగును మా కోరికలన్నీ
నిలబడవే మా వెన్ను కాపుగా

జయము నొసంగవే సర్వమంగళా (జయ)

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...